పీఎం కిసాన్ (PM KISAN) పథకం అనేది భారత ప్రభుత్వం చే ప్రారంభించబడిన ఒక కేంద్ర పథకం, ఇందులో ప్రభుత్వం 100% నిధులు సమకూరుస్తుంది. ఈ పథకం 2018 డిసెంబరు 1 నుండి అమలులోకి వచ్చింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు వివిధ వ్యవసాయ అవసరాలకు సంబంధించి, అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం చేయడం. ముఖ్యంగా, విత్తనాల మరియు కోతల కాలంలో రైతులకు ఆదాయ సహాయం అందించడం, తద్వారా అప్పులపై ఆధారపడకుండా చేయడం. ఈ పథకం కింద రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6000 ఆర్థిక సహాయం మూడు సమాన విడతలుగా అందించబడుతుంది. అంటే ప్రతి 4 నెలలకు ₹2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా ఈ మొత్తాన్ని నేరుగా జమ చేస్తారు. ఇప్పటివరకు 17 వాయిదాలు పూర్తయ్యాయి. 18 వాయిదా 2024 అక్టోబర్ 5వ తేదీ శనివారం న రైతు బ్యాంకు అకౌంట్లో జమ చేసే అవకాశం ఉంది. ఇందులో దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది రైతులకు తలకొకరు రూ. 2,000 చొప్పున లభించనుంది. ఈ విడతకు ప్రభుత్వము మొత్తం రూ. 20,000 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ పథకానికి అర్హులు అవ్వడానికి EKYC అనేది తప్పనిసరిగా ప్రతిఒక్క రైతు చేసుకోవాలి.. ఒకవేళ మీరు ఇంకా EKYC కానీ పూర్తవ్వకపోతే పీఎంకిసాన్ (PMKISAN) పోర్టల్ లో ఓటీపీ (OTP) ఆధారంగా చేస్కోవచ్చు.. ఈ పథకంలో కుటుంబం అంటే భర్త, భార్య మరియు చిన్న పిల్లలు. అర్హులైన రైతు కుటుంబాలను గుర్తించడం రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల బాధ్యత, ఈ పథకం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతు కుటుంబాలను గుర్తిస్తాయి. నిధులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందేవారి అంటే ఎవరి పేరు మీద అయితే భూమి నమోదు చేసి ఉందో వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయబడతాయి. ఈ పథకంలో కొన్ని మినహాయింపు వర్గాలు ఉన్నాయి, అవి ఏంటో కింద చూద్దాం..
పీఎం కిసాన్ పథకం (Pradhan Mantri Kisan Samman Nidhi) – మినహాయింపు వర్గాలు:
పీఎం కిసాన్ పథకం క్రింద ఆర్థికంగా బలమైన వారికి ప్రయోజనాలు లభించవు. ఈ కింది వర్గాల వారికి ఈ పథకం వర్తించదు.
- అన్ని సంస్థాగత భూస్వాములు రాజ్యాంగ పదవులు నిర్వహించిన వ్యక్తులు
- రైతు కుటుంబాలు ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ శాఖలు/కార్యాలయాలు/ప్రతినిధులు మరియు వాటి ఫీల్డ్ యూనిట్లు అన్ని సూపరాన్యుయేటెడ్/రిటైర్డ్ పెన్షనర్లు వీటి నెలవారీ పెన్షన్ రూ.10,000/- లేదా అంతకంటే ఎక్కువ వస్తున్నవారు
- గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు
- ఈ కింద వృత్తులను నిర్వహించే వ్యక్తులు:
- డాక్టర్లు,
- ఇంజనీర్లు,
- న్యాయవాదులు,
- చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు ఆర్కిటెక్ట్లు
ఎలా దరఖాస్తు చేయాలి:
రైతులు PM-KISAN పోర్టల్ (pmkisan.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు లేదా స్థానిక వ్యవసాయ కార్యాలయాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ (CSCs)ను సందర్శించి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.
స్టేటస్: మరొక ముఖ్య విషయం ఏంటి అంటే మీ అకౌంట్లో జమ అయిందా లేదా అని తెలుసుకోడానికి మీ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసాక మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది.
1 thought on “పీఎం కిసాన్ తరువాత విడత ఎప్పుడు అంటే..”